JD Vance in India:భారత్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్

16
- Advertisement -

నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇండియాకు వచ్చారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఉ. 10 గంటలకు ఇటలీ నుంచి భారత్ కు చేరుకోగా ఆయనకు ఘనస్వాగతం లభించింది.

ఇక ఇవాళ సాయంత్ర ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భేటీ కానున్నారు. వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు మోదీ, వాన్స్.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఏపీకి రావాలి అని కోరుతున్నారు వడ్లూరు ప్రజలు. భారత పర్యటనలో భాగంగా అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ పూర్వీకులు నివసించిన వడ్లూరును సందర్శిస్తారని ఆశిస్తున్నారు ప్రజలు. 80 సంవత్సరాల క్రితం గ్రామ అభివృద్ధిలో ఉషా వాన్స్ కుటుంబం కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు గ్రామస్తులు.

Also Read:TTD:నిర్దేశిత స‌మ‌యంలోనే శ్రీవారి దర్శనం

- Advertisement -