జేసీ బ్రదర్స్‌ హౌస్‌ అరెస్ట్…తాడిపత్రిలో టెన్షన్‌

39
jc

ఏపీలోని అనంతరపురం జిల్లాలో హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ బ్రదర్స్‌ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదుచేయగా దీనిని నిరసిస్తూ తహసిల్దార్ కార్యాల‌యం ఎదుట జేసీ బ్ర‌ద‌ర్స్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు పిలుపునిచ్చారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, జేసీ దివాక‌ర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. జేసీ దివాక‌ర్ రెడ్డిని ఫామ్ హౌజ్ వ‌ద్ద‌నే నిర్బంధించ‌గా, ప్ర‌భాక‌ర్ రెడ్డిని ఇంటి వ‌ద్దే పోలీసులు అడ్డుకున్నారు.

ఇప్పటికే తాడిపత్రిలో 30 యాక్టు,144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎటువంటి సభలు, సమావేశాలు, ధర్నాలు నిరసన ప్రదర్శనలకు అనుమతి ఉండదని పోలీసులు తేల్చిచెప్పగా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.