వేములవాడకు పోటెత్తిన భక్తులు..

24
vemulawada

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు వేములవాడకు క్యూ కట్టారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా క్యూ లైన్లలో నిల్చుని స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో వేములవాడ భక్తులతో కిటకిటలాడుతోంది.