తెలంగాణ నూతన సీఎస్ రేసులో ఐఏఎస్ జయేష్ రంజన్ ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం 3 నెలలు పొడిగించారు. ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, రామకృష్ణారావు పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించాలని నిర్ణయించారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌లోకి ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి వెళ్లనున్నట్లు సమాచారం. తెలంగాణ గురుకులాల సెక్రటరీ, గిరిజన సంక్షేమ శాఖ ఇంఛార్జ్ గా పనిచేశారు. మూడు వారాల్లో కేంద్రం నియమించిన పోస్టులో జాయిన్ కావాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.
దళిత విద్యార్థులు సంపన్న వర్గాల నుండి రాలేదు కావున హాస్టల్స్ లో వారి టాయిలెట్స్ వాళ్లే శుభ్రం చేసుకోవాలి, వాళ్ల వంటలు వాళ్ళే చేసుకోవాలి అంటూ ఇటీవలే తను చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read:జోహార్..జయశంకర్ సార్

