ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా వెలిగిన సహజనటి జయసుధ ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తోంది. ఆమెకిప్పుడు 65 ఏళ్ళు. ఆమె భర్త కొన్ని సంవత్సరాల క్రితం కన్ను మూశారు. ఐతే, ఇటీవల వచ్చిన ఒక రూమర్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పుకారు ఏంటంటే… ఓ విదేశీయుడితో జయసుధ ప్రేమలో ఉందని. అంతే కాదు, 65 ఏళ్ల జయసుధని 50 ఏళ్ల ఆ విదేశీయుడు పెళ్లి చేసుకోబోతున్నాడు అని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇవి చదివిన చాలా మంది షాక్ తిన్నారు. అసలు వీళ్ళ మధ్య రిలేషన్ ఏంటి, పెళ్లి ఏంటి అని అందరూ స్టన్ అయ్యారు.
మనమంతా ఎలా ఫీల్ అయినా జయసుధ మాత్రం చాలా బాధ పడిందట. ఆ రూమర్స్ చదివి అలా ఎలా రాస్తారని ఆవేదన చెందిందట. తాను రెండో పెళ్లి చేసుకుంటానో లేదో తెలియదు, కానీ.. ఇలాంటి పుకార్లు మాత్రం తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతాయని అంటున్నారు జయసుధ. హీరోయిన్ గా ఎన్నో రూమర్స్ చూశాను కాబట్టి, తాను అవి పట్టించుకోను.. కానీ, తన కుమారులు, ఇతర కుటుంబ సభ్యులకు ఇబ్బంది ఉంటుంది అని చెప్తున్నారు ఆమె. ఐతే, జయసుధ పై ఈ పుకార్లు రావడానికి కారణం మాత్రం ఆమె. పలు సినీ ఈవెంట్స్ లో జయసుధ ఆ విదేశీయుడితో కలిసి వచ్చారు.
పైగా ఆ విదేశయుడు జయసుధతో చాలా సన్నిహితంగా కనిపించాడు. దర్శకుడు గుణశేఖర్ కుమార్తె వివాహంలో అయితే, జయసుధ – ఆ విదేశీయుడు భార్యాభర్తలు లాగే నూతన వధూవరులను దీవించారు. ఇవన్నీ చూసిన జనం.. జయసుధ గురించి పై విధంగా అనుకోవడంలో తప్పు లేదు. అయినా, ఈ వయసులో జయసుధ ప్రేమలో పడటం ఏమిటి ? అనేది అనవసరమైన విషయం. 65 ఏళ్ల వయసులో ఆమె తనకంటూ ఓ తోడును కోరుకుంది అనుకోవడంలో తప్పు లేదు. బహుశా జయసుధ కూడా ఇలా అనుకోవాలి అనే కోరుకుంటుందేమో.
Also Read:రైతుబంధు ఇప్పట్లో లేనట్లే..?