సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహర్షి. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మే9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. మే1 హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది.
ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది సహజనటి జయసుధ. మహర్షిలో ప్రకాశ్ రాజ్ భార్యగా కనిపిస్తానని సినిమా అద్భుతంగా ఉందన్నారు. మహేష్ నటను ఫిదా కావాల్సిందేనని తెలిపిన జయసుధ…రెండు సీన్లలో మహేష్ కన్నీళ్లు తెప్పించారని చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో మహేష్ నటనకి అవార్డు రావడం ఖాయమన్నారు.
విజయనిర్మలకి బంధువును కావడం వల్ల కృష్ణ కుటుంబసభ్యులతో మంచి అనుబంధం ఉందన్నారు. మహేశ్ బాబును బాల నటుడి నుంచి చూస్తున్నానని ఆయనతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు,బ్రహ్మోత్సవం చేశానని తెలిపారు జయసుధ.