ఆర్ఆర్ఆర్.. ఎన్టీఆర్ కోసం శ్రీలంక హీరోయిన్

222
jacqueline ntr

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈమూవీ తాజాగా రెండవ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత డివివి. దానయ్య. ఈమూవీలో హీరోయిన్లుగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ హీరోయన్ డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తున్నట్లు ఇటివలే ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు చిత్రయూనిట్. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈచిత్రం నుంచి తప్పకుంది హాలీవుడ్ హీరోయిన్ బైసీ ఎడ్గార్.

అయితే రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం హీరోయిన్ ను వెతుకుతున్నాడు. వారిలో ముఖ్యంగా శ్రద్దా కపూర్, పరిణితి చోప్రా, నిత్యామీనన్ లో పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. కిక్ చిత్రంలో సల్మాన్ కు జోడిగా నటించిన జాక్వేలిన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.

కిక్ చిత్రంతో జాక్వెలిన్‌కి మంచి బ్రేక్ ఇచ్చిన స‌ల్మాన్ ఖాన్ ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌కి జోడీగా శ్రీలంక భామ‌ని ఎంపిక చేయ‌మ‌ని సూచించాడ‌ట‌. రాజమౌళి అనుకున్న పాత్రకి ఆమె కరెక్ట్ గా సూటవుతుందని చెప్పాడట సల్మాన్. ఈవార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈసినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించనున్నారు. ఈమూవీ 2020 జూలై 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.