మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఇటీవలె విడుదలైన ఈ సినిమా రికార్డుల పరంపర సృష్ఙిస్తోంది. విడుదలైన రెండు రోజులకే రూ.100 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డును నెలకోల్పింది. పూర్తి రాజకీయ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖుల నుంచి ప్రశంసలందుకుంటుంది. సినీ ప్రముఖుల నుంచే కాక రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసల కూరిస్తూనే ఉన్నాయి. గతంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ సినిమా పట్ల ఉన్న తన అభిప్రాయాన్ని తెలిపారు. తాజాగా అదే దారిలో వచ్చారు లోక్ సత్తా పార్టీ అధినేత జయ ప్రకాష్ నారాయణ.
ఈ సినిమాపై ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపిస్తూ.. నా కుటుంబ సభ్యులు, స్నేహితులతో భరత్ అనే నేను సినమా చూశా. ఈ సినిమా ప్రజలను ఆలోచింపజేసేలా చట్ట నిబంధనలు, లోకల్ గవర్నెన్స్ అనే బలమైన సందేశాలను అందించారన్నారు. కొరటాల శివ దైర్యానికి, విజయవంతమైన కష్టానికి కుడోస్’ అని ట్విట్ చేశారు. ఈ ట్విట్‌కు కొరటాల స్పందిస్తూ..మీలాంటి వ్యక్తుల వద్ద నుంచి ప్రశంసలందుకోవడం గౌరవంగా భావిస్తున్నాన్నంటూ మెరుగైన సమాజానికి నిర్మించడానికి మాకు మీ అవసరం కావాలి సర్ అంటూ రీ ట్విట్ చేశాడు.