తెలుగులో జాతీయస్థాయి దర్శకుడిగా గుర్తింపు పొందిన ఎస్ఎస్ రాజమౌళి ఆదివారంనాడు జయమ్మ పంచాయతీ` టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. టైటిల్ రోల్‌ను సుమ కనకాల పోషించగా వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు.
చిత్రం గురించి చెప్పాలంటే, ప్రముఖ యాంకర్, బుల్లితెర వ్యాఖ్యాత, హోస్ట్ అయిన సుమ కనకాల పల్లెటూరి డ్రామా చిత్రమే జయమ్మ పంచాయతీ
. ప్రధాన పాత్రతో సుమ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది. షూటింగ్ పూర్తయిన ఈ చిత్ర గురించి చిత్ర యూనిట్ ప్రచారం మొదలు పెట్టింది. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈరోజు ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించారు.
ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా సుమ నటించిందనేది ఈరోజు విడుదలైన టైటిల్ సాంగ్‌లో కనిపిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సందర్భానుసారంగా బాణీలు సమకూర్చారు. దీనికి శ్రీకృష్ణ గాత్రం అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాశారు. ఈ పాట ఫన్నీ విజువల్స్‌తో ఆకట్టుకునేలా వుంది.దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు సినిమా కోసం వర్కబుల్ సబ్జెక్ట్‌తో ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుష్క కుమార్ కెమెరా విభాగం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.త్వరలో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు: సుమ కనకాల
సాంకేతిక సిబ్బందిః
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: విజయ్ కుమార్ కలివరపు, సంగీతం: M.M. కీరవాణి, కెమెరాః అనూష్ కుమార్, ఎడిటర్: రవితేజ గిరిజాల, నిర్మాత: బలగ ప్రకాష్, సమర్పణ: శ్రీమతి. విజయ లక్ష్మి
బ్యానర్: వెన్నెల క్రియేషన్స్,
కళ: ధను అంధ్లూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అమర్ – అఖిల
పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచెర్ల
కాస్ట్యూమ్స్: హరి ప్రియ
PRO: వంశీ-శేఖర్
డిజిటల్ PR: మనోజ్ వల్లూరి
డిజిటల్ ప్రచారాలు: హాష్‌ట్యాగ్ మీడియా