సుమ సినిమాతో వీరి కల నేరవేరింది..!

73
- Advertisement -

యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ` చిత్రం ద్వారా తాము నటీనటులుగా పరిచయం అయ్యామని యువ జంట దినేష్ కుమార్, షాలినీ తెలియజేస్తున్నారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ‘జయమ్మ పంచాయితీస . విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది. ఈ సందర్భంగా యువ జంట దినేష్ కుమార్, షాలినీ మీడియా సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు.

దినేష్ కుమార్ మాట్లాడుతూ.. నాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. దర్శకుడిది మా ఊరే. బి.టెక్ చదివాక మదర్‌బోర్డ్ డిజైనర్గా జాబ్ చేశాను. కానీ చిన్నతనంనుంచి నటుడు అవ్వాలనే కోరిక బలంగా వుండేది. 8 ఏళ్ళుగా చేస్తున్న కృషి ఫలించి ఏకంగా సుమ సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు కాస్టింగ్ కాల్ ద్వారా నన్ను ఎంపిక చేశారు. దర్శకుడు మా ఊరివాడు కావడంతో మా ఇద్దరి మద్య ఫ్రీక్వెన్సీ బాగుంది. ఇందులో సత్య అనే పూజారి పాత్ర పోషించాను.

విలేజ్లో అల్లరి చిల్లరిగా తిరిగే పూజారి అనిత అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత మా ఇద్దరి ప్రేమకు చిన్న సమస్య వస్తుంది. మరోవైపు జయమ్మకు ఓ సమస్య వుంటుంది. ఆమె సమస్యకూ మా సమస్యకూ లింక్ వుంటుంది. అది సినిమాలో చూడాల్సిందే. నాకూ సుమకు కొన్ని సన్నివేశాలున్నాయి. ఆమెతో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను సోలో హీరోగా చేసినా రాని పబ్లిసిటీ `జయమ్మ.. సినిమాలో చేయడంవల్ల వచ్చింది. ఇటీవలే కొన్ని ప్రాంతాలు పర్యటించాం. ట్రైలర్ లో నా పాత్ర బాగా పాపులర్ అయింది. అందరూ నన్ను గుర్తుపడుతున్నారు. నటుడికి మంచి బేనర్ దొరకడం కూడా లక్కే. నాకు భక్తి ఎక్కువ. మా ఊరిలో కోటదుర్గమ్మని మొక్కుకున్నా. యాదృశ్చికంగా నేను ఏదైతే అనుకున్నానో ఆ పాత్ర దొరకడం, ఆ అమ్మవారి సన్నిధిలోనే షూటింగ్ జరుపుకోవడం చాలా థ్రిల్ కలిగించింది. జయమ్మ పంచాయితీ సినిమా నటుడిగా నిరూపించుకునే అవకాశం ఇచ్చింది అన్నారు.

షాలినీ మాట్లాడుతూ.. మా అమ్మగారిది మొగల్తూర్, నాన్నది హైదరాబాద్. నేను ఇక్కడే పెరిగాను. అయితే సినిమాలపై ఆసక్తి ఎక్కువ. అందుకే తమిళ షార్ట్ ఫిలిం చేశాను. ఆ తర్వాత కొన్ని రెస్టారెంట్ యాడ్స్ కూడా చేశాను. పాండమిక్ టైంలో కొంత గ్యాప్ వచ్చింది. జయమ్మ.. సినిమాకు పనిచేస్తున్న రచయిత నన్ను ఇందులో పాత్రకు ప్రిఫర్ చేశారు. దర్శకుడు ఆడిషన్ ద్వారా ఎంపిక చేశారు. బేసిగ్గా నా పాత్ర వేరే ఊరు నుంచి శ్రీకాకుళం వస్తుంది కాబట్టి నాకు యాస పలికే అవకాశం పెద్దగా వుండదు. కానీ మిగిలిన పాత్రలన్నీ చక్కగా యాసతో మాట్లాడారు.

నా పాత్రకూ జయమ్మకు పెద్దగా సన్నివేశాలు వుండవు. కానీ మా లవ్ స్టోరీకి జయమ్మకు వచ్చిన సమస్యకూ లింక్ వుంటుంది. అది సినిమాలో ఆసక్తికరంగా వుంటుంది. శ్రీకాకుళం, ఆముదాలవలస, పాలకొండ, కోటిపల్లి వంటి ప్రాంతాల్లో షూటింగ్ తీశారు. లొకేషన్లు చాలా సుందరంగా వున్నాయి. ఇందులో నా రియల్ లైఫ్కు వ్యతిరేకమైన పాత్ర పోషించాను. పాత్ర అందరూ మెచ్చుకునేలా వుంటుంది. నటిగా నాకు గుర్తింపు వస్తుందనే నమ్ముతున్నాను.. అని చెప్పారు.

- Advertisement -