తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఆ రాష్ట్రంలోని కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక ఆమె సొంత రాష్ట్రమైన తమిళనాడులో ఏకంగా ఆమె గుడినే కట్టారు అంటే ఆమెపై వాళ్లకు ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవాలి. జయలలిత మరణించి మూడు ఏండ్లు అయినా ఇంకా ఆమె తమిళ ప్రజలు తలచుకుంటూనే ఉంటున్నారు.
తమిళ ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలు అందించి ఆసరాగా నిలిచారు. తాజాగా ఏఐఏడీఎంకే నేత ఒకరు అమ్మ మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఏఐఏడీఎంకే నేత ఏన్ భవానీ శంకర్ కుమారుడు ఎస్పీ సాంబశివరామన్-దీపికల పెళ్లిని జయలలిత సమాధి వద్దే ఘనంగా నిర్వహించారు. నిన్న జరిగిన ఈపెళ్లికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.
తమిళనాడు సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లిని వైభవంగా జరిపించారు. జయలలిత ఆశీస్సుల కోసమే తమ కుమారుడి పెళ్లిని ఇక్కడ జరిపించినట్లు భవానీ శంకర్ తెలిపారు. ఈ వివాహా వేడుకకు ఏఐఏడీఎంకే నేతలు, ఇతర ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చి నూతన వధువరులను ఆశీర్వదించారు.