అమ్మ అసలు వారసురాలిని నేనే..

303
jayalalithaa
- Advertisement -

జయలలిత మృతితో ఆమె రాజకీయ..ఆస్తుల విషయంలో అప్పుడే పోరు మొదలైంది. అమ్మ వారసురాలు నేనేనంటూ జయలలిత అన్న కూతురు.. మేకకోడలైన దీపా జయకుమార్‌ మీడియాకు ప్రకటించారు. . జయలలిత అవివాహిత కావడం వల్ల వారసులంటూ ఎవరు లేకపోవడంతో.అమ్మ అంత్యక్రియలను ఆమె నచ్చెలి శశికళ అంతిమ సంస్కారం నిర్వహించారు. దీంతో శశికళ తీరుపై జయలలిత కుటుంబ సభ్యుల నుంచి విముఖత వ్యక్తం అవుతోంది. జయలలితకు ఆమె స్నేహితురాలు శశికళ అంత్యక్రియలు నిర్వహించడమేంటని జయ మేనకోడలు దీపా జయకుమార్‌ మండిపడ్డారు. బుధవారం ఆమె మెరీనా బీచ్‌లో జయలలిత మహా సమాధిని సందర్శించి నివాళులర్పించారు.

jayalalithaa

ఈ సందర్భంగా కొన్ని ఛానెళ్లతో మాట్లాడారు. ‘మా అత్తకు శశికళ అంతిమ సంస్కారం నిర్వహించడమేంటని, ఆ దృశ్యాలు తమ కుటుంబానికి తీవ్ర ఆవేదన కలిగించాయని చెప్పారు. జయలలిత మృతికి సంబంధించి బయటకు తెలియని అనేక అంశాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని తెలిపారు. వేద నిలయంలోకి వెళ్లనివ్వకుండా తమను అడ్డుకుంటున్నారని, జయలలితకు నిజమైన వారసురాలిని తానేనని ఆమె ప్రకటించారు. చెన్నై టీనగర్లో నివశిస్తున్న దీపా జయకుమార్‌ గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్నారు. ఈమె జయలలిత సోదరుడు జయకుమార్‌ కుమార్తె.

గ‌తంలో కూడా జ‌య ఆరోగ్యంపై దీప ఆసుపత్రి ద‌గ్గ‌ర ఆందోళ‌న చేయ‌టం తెలిసిందే. దీప స్వ‌యానా జ‌య‌ల‌లిత స్వ‌యాన సోధ‌ర‌డు జ‌య‌కుమార్‌, విజ‌ల‌క్ష్మిల కూమార్తే దీప‌. కొన్నాలు జ‌య‌తో క‌ల‌సి పోయెస్ గార్డెన్‌లో ఉండేవారు. ఆ ఇంట్లోనే దీప జ‌న్మించింది. త‌రువాత జ‌య‌ల‌లిత సోద‌రుడు జ‌య‌కుమార్ మ‌ద్య మ‌నస్ప‌ర్థ‌లు రావ‌టంతో పోయెస్ గార్డెన్ వ‌ద‌లి టీన‌గ‌ర్ కు కాపురం మార్చారు. 1995లో జయకుమార్ మృతి చెందగా జయలలిత ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. 2013లో వదిన చనిపోయినపుడు మాత్రం జయలలిత వెళ్లలేదు. ఇటీవల జరిగిన మేనకోడలు దీప వివాహానికీ హాజరు కాలేదు. దీంతో వధూవరులే జయలలిత ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొంది వచ్చారు.

jayalalithaa

ఈ సందర్భంగా వధూవరులకు అత్త హోదాలో జయలలిత ఒక ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్లు సమాచారం. దీప వైవాహిక జీవితం కొన్నాళ్లు సజావుగా సాగినా ఆ తరువాత భర్తతో విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. భర్తకు దూరమై, తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన దీప గతంలో అత్త జయలలితకు చేరువకావాలని ప్రయత్నించింది. ఇటీవల జయ ఇంటి వద్ద గంటసేపు నిరీక్షించినా అనుమతి రాలేదు. ‘పోయెస్‌గార్డెన్‌లోని ఈ ఇల్లు మా నానమ్మ (జయలిత తల్లి సంధ్య) నాకు రాసిచ్చింది. దస్తావేజులు కూడా ఉన్నాయి.

మా ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు మీరు ఎవరు?’ అంటూ దీపం గతంలో సెక్యూరిటీ అధికారులతో ఘర్షణ పడింది.
మా నాన్న కుటుంబీకులు అత్తకు దగ్గర కావడం గార్డెన్‌లోని కొందరికి ఇష్టం లేదంటూ గతంలో శశికళపై దీప పరోక్ష ఆరోపణలు చేసింది. జయలలితే స్వయంగా తనను రాజకీయ వారసురాలిగా ప్రకటించాలని గతంలో దీప ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. మేనత్త జయలలిత మృతి నేపథ్యంలో ఆమె రాజకీయ వారసురాలిగా మళ్లీ తెరపైకి వచ్చేందుకు దీప ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

- Advertisement -