జయలలిత ఆస్తులు చూస్తే కళ్లు చెదరడం ఖాయం. 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు ఇలా వివరాలు చూస్తే నోరేళ్ల బెట్టడం ఖాయం.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు బెంగళూరులోని కోర్టు అధికారులు.
10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు తదితరాలను తీసుకు వెళ్లేందుకు భారీ భద్రతతో ఆరు ట్రంకు పెట్టెలు తీసుకువచ్చారు అధికారులు.
Also Read:ది డెవిల్స్ చైర్.. అవునని, కాదని సాంగ్
జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరిచారు అధికారులు. ఆస్తుల విలువ కనీసం రూ.4,000 కోట్లుగా ఉండొచ్చని అనధికారికంగా తెలుస్తోంది.