జయహో రామానుజ..లిరికల్ సాంగ్స్

19
- Advertisement -

లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ‘జయహో రామానుజ’ సినిమా పాటలను తిలకించిన తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లయన్ సాయి వెంకట్ కు అభినందనలు అందజేశారు. పాటలు బాగున్నాయంటూ వారు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ‘జయహో రామానుజ’ లిరికల్ సాంగ్స్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ – ‘జయహో రామానుజ’ సినిమా చేయాలనేది నా మిత్రుడు లయన్ సాయి వెంకట్ కల. తన కలను నెరవేర్చుకున్న సంతోషంలో ఆయనలో కనిపిస్తోంది. ‘జయహో రామానుజ’ పాటలు చాలా బాగున్నాయి. భక్తితో పాటు సామాజిక చైతన్యాన్ని అందించేలా పాటలను రూపకల్పన చేశారు. ఇలాంటి మరిన్ని గొప్ప చిత్రాలను సాయి వెంకట్ రూపొందించాలి. ఈ సినిమా నా మిత్రుడికి గొప్ప విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ – కులమతాలు సమాజంలో విబేధాలు తీసుకురావొద్దనే గొప్ప సందేశాన్ని వెయ్యేళ్ల కిందటే ఇచ్చిన గురువు శ్రీ రామానుజాచార్యులు. ఆయన జీవిత కథతో సినిమా చేయడం లయన్ సాయి వెంకట్ చేసుకున్న అదృష్టం. సినిమాను ఎంతో వ్యయప్రయాసలతో ఆయన రూపొందించాడు. ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ అన్నీ చూశాం. చాలా బాగున్నాయి. పాటలు ‘జయహో రామానుజ’ చిత్ర విజయంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. లయన్ సాయి వెంకట్ కు ఈ సినిమా చిరకాల కీర్తిని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ – ‘జయహో రామానుజ’ చిత్ర సాంగ్స్ బిగ్ సీడీ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. భక్తిని, చైతన్యాన్ని అందించేలా సంగీత సాహిత్యాలు కుదిరాయి. ‘జయహో రామానుజ’ సినిమా ఈతరం ప్రేక్షకులు చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమా రూపొందించడం సాధారణ విషయం కాదు. సాయి వెంకట్ ఎంతో ఇష్టంతో, భక్తితో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆయనకు ‘జయహో రామానుజ’ మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా  అన్నారు.

Also Read:Pawan:పవన్ ఫస్ట్ స్పీచ్..నవ్వులే నవ్వులు

- Advertisement -