లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ట్రైలర్

329
Jaya Janaki Naayaka Official Trailer
- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’. బోయపాటి గత సినిమాలన్నీ మాస్‌ టైటిల్స్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లకొండ శ్రీనివాస్‌.. జయ జానకి నాయక సినిమాతో ఆగస్ట్ 11న మరోసారి వస్తున్నాడు. బెల్లకొండ తొలిసారిగా బోయపాటి చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. గత సినిమాల్లో లాగా కాకుండా శ్రీను ఇప్పుడు కొంచెం క్లాస్ టచ్ తో వస్తున్నట్లు ఫస్ట్‌ టీజర్‌లో కనిపించాడు.. టీజర్ లోని ప్రతి ఫ్రేమ్ చాలా క్లాస్ గా ఉండటంతో ఇది బోయపాటి మార్క్ కాదే అనే డౌట్ అందరిలో కలిగింది. ఆ తరువాత వచ్చిన టీజర్‌లో మాత్రం ఊర మాస్‌గా కనిపించాడు.

తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు… ఈ ట్రైలర్‌ చూస్తుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాసన్ కి క్రేజ్ ఏర్పడేలా బోయపాటి శ్రీను గట్టి ప్రయత్నమే చేసినట్టు కనిపిస్తోంది. “ఎవరున్నా లేకున్నా .. ఎవరొచ్చినా రాకున్నా .. నీకు నేనున్నా” అంటూ కథానాయికతో హీరో చెప్పే డైలాగ్ యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకునేదిలా వుంది. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ కలయికగా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. రకుల్ .. కేథరిన్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలా కనిపించేలా వుంది. సాఫ్ట్ టైటిల్ పెట్టినా యాక్షన్ పార్ట్ విషయంలో బోయపాటి ఎంత మాత్రం తగ్గలేదు .. అదరగొట్టేశాడంతే.

శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు. ఇందులో శ్రీనివాస్ తో సహా మొత్తం ఆరుగురు హీరోలు, మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిపి ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ భారీ ఆశలు పెట్టుకున్నాడు.

- Advertisement -