రివ్యూ: జయ జానకి నాయక

234
Jaya Janaki Naayaka movie review
- Advertisement -

బడా హీరోలతో మాస్ యాక్షన్ సినిమాలు చేసిన బోయపాటి, అందుకు భిన్నంగా తొలిసారి ఓ యువ కథానాయకుడితో జట్టు కట్టారు. ‘భద్ర’ తర్వాత బోయపాటి తీసిన ప్రేమకథ ‘జయ జానకి నాయక’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఇది మూడో సినిమా. ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం….

కథ:
గగన్‌(బెల్లంకొండ శ్రీనివాస్‌)కు కుటుంబం అంటే చాలా ఇష్టం. నాన్న చక్రవర్తి (శరత్‌కుమార్‌) అన్నయ్య(నందు)లంటే అత‌నికి ప్రాణం. గగన్‌కు స్వీటి(రకుల్‌ప్రీత్‌సింగ్‌) పరిచయం అవుతుంది. ఆమె రాకతో చక్రవర్తి ఇంటి స్వరూపమే మారిపోతుంది. స్వీటి-గగన్‌ ప్రేమించుకుంటారు. అయితే స్వీటి జీవితంలో అనుకోని ఓ సంఘటన ఎదురవుతుంది. అప్పటి వరకూ సీతాకోకచిలుకలా ఎగిరిన ఆమె.. ఒక్కసారిగా పంజరంలో పావురం అవుతుంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు ఏం చేశాడు? ఎవరిపై పోరాటం చేశాడు? తదితర విషయాలు తెరమీద చూడాలి.

ప్లస్ పాయింట్స్‌:
సినిమాకు భారీ తారాగణం, నిర్మాణ విలువలు, రకుల్‌ప్రీత్ సింగ్ నటన, బోయపాటి మార్క్ దర్శకత్వం ప్రధాన బలాలు. బోయపాటి శ్రీను ప్రధాన బలం యాక్షన్‌. యాక్షన్‌.. మాస్‌ లేనిదే కథలు ఎంచుకోడు. ఈ సినిమా కూడా అదే కోవాకు చెందుతుంది. సినిమాలో యాక్షన్‌ ఘట్టాలు మాస్‌ ప్రేక్షకులకు నచ్చుతాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ బలాలు, బలహీనతలు బోయపాటి బాగా గమనించాడు. అందుకు తగినట్టుగానే సన్నివేశాలు రాసుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో, డాన్సుల్లో బాగానే చేశాడు. క్లైమాక్స్‌లో ఎమోషనల్‌ డైలాగ్‌లు బాగా పలికాడు.

aya-Janaki-Nayaka-Movie

రకుల్‌ పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. తొలి సగం ఓ సాధారణ అమ్మాయిగా కనిపించిన ఆమె.. ద్వితీయార్ధంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న అమ్మాయిగా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. జగపతిబాబు ఈ చిత్రంలో మరింత స్టైలిష్‌గా కనిపించారు. ఆయన వచ్చే ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నందూకి కూడా మంచి పాత్రే దక్కింది. శరత్‌కుమార్‌ నటన బాగుంది. చాలా కాలం తర్వాత వాణీ విశ్వనాథ్‌ తెరపై కనిపించారు. అయితే ఆ పాత్రకు ప్రాధాన్యం దక్కలేదు. ప్రగ్యా జైస్వాల్, కేథరీన్‌ గ్లామర్ పరంగా ఆకట్టుకున్నారు.

మైనస్‌ పాయింట్స్:
ఈ సినిమాలో ప్రధాన లోపం కామెడీ లేకపోవడం. బెల్లకొండ శ్రీనివాస్ నటనతో అంతా ఆకట్టుకోలేకపోయాడు. బోయపాటి మార్క్ ఎమోషన్స్ పండించడంలో శ్రీనివాస్ పూర్తిగా విఫలమయ్యాడు. ఎమోషనల్ డైలాగులు చెప్పినప్పుడు, భావోద్వేగ సన్నివేశాల్లో శ్రీనివాస్ నటనను అతిగా అనిపిస్తుంది. ఇక కథా, కథనాల్లో మలుపులు ఉన్నా, అవి సమర్థంగా తెరపై చూపించకపోవడం లోపంగా చెప్పుకోవచ్చు. కొత్తదనం, భారీ ట్విస్టులు ఊహించుకుంటే మాత్రం కొంచెం నిరాశ తప్పదు.

still-1

సాంకేతిక విభాగం:
టెక్నికల్ అంశాల పరంగా చూస్తే… దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, పాటలు అద్భుతంగా ఉన్నాయి.. ఎప్పటిలానే దేవీ శ్రీ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో అదరగొట్టాడు. రిషి పంజాబి కెమెరా వర్క్ సినిమాకు హైలెట్ అయ్యాయి. కొరియోగ్రఫీ, యాక్షన్ సీన్లు, డాన్స్, డైలాగులు బోయపాటి స్టైల్ లో ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:
కొత్తదనం, భారీ ట్విస్టులు పెద్దగా కథలో లేకపోయినా భారీ తారాగణం,ఖర్చుతో అలా చూస్తూ ఉండిపోయేలా చేయటంలో మాత్రం బోయపాటి విజయం సాధించాడు. మాస్ ప్రేక్షకులను మాత్రం శీను ఎప్పటిలాగే కట్టిపడేసాడు. క్లాస్ సినిమాలు ఇష్టపడే ‘ఎ’ సెంటర్ ప్రేక్షకులు పెద్దగా నచ్చక పోవచ్చని, లాజిక్స్ కి దూరంగా ఉండే సరైనోడు, లెజెండ్ తరహా మాస్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం జయజానకి నాయక సినిమా నచ్చుతుంది అనే టాక్ వచ్చింది.

విడుదల తేదీ : 11/08/2017
రేటింగ్ : 2.75/5
నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌,రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత : మిర్యాల రవీందర్‌రెడ్డి
దర్శకత్వం : బోయపాటి శ్రీను

- Advertisement -