జవాన్ కొత్త రికార్డ్స్.. కానీ అక్కడ నిషేధం

28
- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పైగా పూర్తి పాజిటివ్ టాక్ తో తొలి రోజు భారీ కలెక్షన్లను దక్కించుకుంది. సినిమా రిలీజైన మొదటి రోజే ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 75 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టి, ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ముందు పఠాన్‌ రూ.55 కోట్లు, కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 రూ. 54 కోట్లు, బాహుబలి రూ. 41 కోట్లు కలెక్ట్ చేశాయి.

మొత్తానికి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన రెండు చిత్రాలు పఠాన్, జవాన్ ఓపెనింగ్ రోజే రూ.100 కోట్ల గ్రాస్ ను సాధించాయి. ఈ రికార్డు సాధించిన ఏకైక బాలీవుడ్ యాక్టర్‌గా ఆయన నిలిచారని ట్రేడ్ ఎనలిస్ట్ మనోబాల విజయబాలన్ వెల్లడించారు. ఇప్పట్లో షారుఖ్ ఖాన్ రికార్డ్స్ ను ఎవరూ బ్రేక్ చేయలేరు అని మేకర్స్ చెబుతున్నారు.ఐతే, దేశవ్యాప్తంగా గురువారం విడుదలైన జవాన్ సినిమా బంగ్లాదేశ్‌లో మాత్రం షెడ్యూల్ ప్రకారం ఇంకా విడుదల కాలేదు. బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జవాన్ విడుదలను బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్ నిషేధించింది. అవినీతి, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా బంగ్లాదేశ్‌లో రిలీజ్ అయితే.. ప్రభుత్వానికి నష్టం కాబట్టి.. అక్కడి ప్రభుత్వం జవాన్ రిలీజ్ ను అడ్డుకుంది. ఇక ఈ సినిమాలో షారుఖ్, నయనతార, విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారు. ఫస్టాఫ్ అంతా చాలా ఫాస్ట్‌గా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే గూస్‌ బంప్స్. పదునైన స్క్రీన్‌ప్లే, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు, BGM, క్లైమాక్స్, మాస్ ఎలివేషన్లు ఆకట్టుకున్నాయి. మొత్తానికి షారుఖ్ సూపర్ హిట్ కొట్టాడు.

Also Read:బీజేపీలో ఉండలేకపోతున్నారా?

- Advertisement -