65 లక్షల విరాళం ఇచ్చిన ‘జట్టు ఇంజనీర్’..

316
- Advertisement -

దేశంలోనే తొలి సారిగా హర్యానా స్టేట్ సిర్సా లోని హ్యూమన్ బోన్స్ బ్యాంకు (మానవ ఎముకల బ్యాంకు) ని స్థాపించబోతున్నారు. అయితే ఈ బోన్స్ బ్యాంకు కు నిర్మాణానికి ప్రముఖ ఆథ్యాత్మిక వేత్త, నటుడు డాక్టర్. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన వంతు సహాయంగా ‘జట్టు ఇంజనీర్’ సినిమా కలెక్షన్స్ నుండి 25లక్షలు, తన వంతు 40లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. షా సత్నాం జీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్, లోకమాన్య బ్లడ్ బ్యాంక్, వారి ఆధ్వర్యం లో జులై 16న సాయంత్రం స్వామిజి భక్తులు రక్త దాన శిబిరాలు నిర్వహించిన సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమం లో 65లక్షల చెక్కు ని బోన్స్ బ్యాంకు నిర్వాహకులకు అందచేశారు. అదే రోజు త్వరలో విడుదల కాబోయే ‘యం యస్ జి ఆన్లైన్ మహి’ చిత్రానికి సంబందించిన కొన్ని సన్నివేశాలను సిర్సా లోని అనాజ్ మొండి లో ఒకే సారి 65 వేల 750 మంది భక్తులు తిలకించారు.

'Jattu Engineer' Earnings To Bones Bank Construction

ఈ సందర్భంగా డాక్టర్.యం యస్ జి మాట్లాడుతూ – “ప్రతి రోజు భారతీయ రహదారులలో జరుగుతున్న ప్రమాదాలకు ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదం లో గాయపడిన వారు తమ అవయవాలను కూడా కోల్పోతున్నారు. ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు బ్లడ్ బ్యాంకు లు ఏ స్థాయిలో సహాయ పడుతున్నాయో, అదే స్థాయిలో అవసరానికి ఎముకలు కూడా ఈ బ్యాంకు నుండి ఇవ్వబడతాయి. ఈ లాంటి బోన్ బ్యాంక్స్ భారతావని నలుమూలల ఏర్పాటు చేస్తే గాయపడిన వారికి అంగ వ్యైకల్యం లేకుండా పోతుంది. నేను అందించిన ఐదు సినిమాలు మంచి బ్లాక్ బస్టర్స్ చిత్రాలుగా నిలిచాయి ఇక నుండి నా సినిమాల కలెక్షన్స్ లో ప్రజోపకార్యక్రమాలకు కొంత కలెక్షన్స్ విరాళంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను. త్వరలో ‘యం యస్ జి ఆన్లైన్ మహి’ చిత్రం విడుదల కాబోతుంది .” అన్నారు.

'Jattu Engineer' Earnings To Bones Bank Construction

- Advertisement -