టీ20 వరల్డ్ కప్‌కు బుమ్రా దూరం

301
bumra
- Advertisement -

త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్ నుండి భారత స్టార్ బౌలర్ జస్పిత్ బుమ్రా తప్పుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రటించింది. గాయం కారణంగా బుమ్రా వరల్డ్ కప్‌లో ఆడే పరిస్థితి లేదని తెలిపింది. బుమ్రా స్ధానంలో మరో ఆటగాడి పేరును త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. పేస్ కు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్ లపై బుమ్రాకు మంచి రికార్డు ఉంది. అయితే బుమ్రా తప్పుకోవడంతో అతడి స్ధానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియాలో జరగనుంది. భారత తన తొలి మ్యాచ్‌ అక్టోబర్ 23న దాయాది పాకిస్థాన్‌తో ఆడనుంది.

- Advertisement -