శ్రీదేవి కూతురు జాన్వీ నటించిన తొలి సినిమా ధడక్ రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి శశాంక్ దర్శకత్వం వహించారు. జూలై 20న విడుదలైన ఈ చిత్రం బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. లవ్ అండ్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది.
ఇక తొలి సినిమాతోనే జాన్వీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. నటన, అందం పరంగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. మొదటి వారంలోనే రూ.63.39 కోట్ల వసూళ్లను రాబట్టింది. 10 రోజులలో రూ.100 కోట్ల గ్రాస్ ని చేరుకుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడడంతో మరిన్ని వసూళ్లు రాబడుతోందని అంటున్నారు. మొదటి సినిమాతోనే భారీ మొత్తంలో కలెక్షన్స్ రాబట్టి… మంచి గుర్తింపు తెచ్చుకుని శ్రీదేవి కూతురు అని పించుకుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.