పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన జాన్వీ క‌పూర్..

57
Janhvi Kapoor

శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ సినిమాల తన గ్లామ‌ర్‌తో అభిమానుల‌ని అల‌రిస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ ఫొటో షూట్స్ చేస్తూ వాటిని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుంది. ఫొటోల‌లో జాన్వీ అందాల ఆర‌బోత‌కి నెటిజ‌న్స్ మంత్ర ముగ్ధులు అవుతున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ త‌న భవిష్యత్తు పెళ్లి గురించి, అది ఎలా ఉండాలో చెప్పుకొచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఇటీవల జాన్వీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మనసులో మాట బయటపెట్టింది. తన వెడ్డింగ్‌ డ్రీమ్‌ గురించి చెప్పుకొచ్చింది. కాబోయేవాడికి తెలివితేటలుంటే చాలని చెప్పింది. ‘‘పెళ్లి పనులన్నీ రెండు మూడు రోజుల్లో అయిపోవాలి. కాప్రి ఐల్యాండ్‌లో ఓ ప్రైవేట్‌ బోట్‌లో నా స్నేహితులతో కలిసి బ్యాచ్‌లర్‌ పార్టీ చేసుకున్నాక తిరుపతిలో నా పెళ్లి చేసుకుంటాను. మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్‌లో అమ్మ నివసించిన ఇంటిలోనే జరగాలి. పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది నా కోరిక’’ అని తెలిపింది.