విజయ్‌ దేవరకొండలా మారిపోతా-జాన్వీ కపూర్

246
- Advertisement -

టాలీవుడ్‌లో హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు ఎకంగా బాలీవుడ్ హీరోయిన్లను తన వైపుకు తప్పుకుంటున్నాడు. విజయ్‌ దేవరకొండతో కలిసి నటించాలని ఉందని బాలీవుడ్‌ నటి, శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్‌ అన్నారు. ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ‘కాఫీ విత్‌ కరణ్‌’. దీనికి జాన్వి తన సోదరుడు అర్జున్‌ కపూర్‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా జాన్విని కరణ్‌ ఓ ప్రశ్న అడిగారు.. ‘రేపు పొద్దున్న నిద్రలేవగానే నువ్వొక మగాడిగా మారిపోతావ్’ అంటే, ఎవరిలా మారిపోవాలని కోరుకుంటావు?’ అని అడగగా దానికి జాన్వీ షాకింగ్‌ సమాదానం ఇచ్చింది.

Janhvi Kapoor

జాన్వీ స్పందిస్తూ .. ‘విజయ్ దేవరకొండ మాదిరిగా మారిపోతాను’ అంటూ సమాధానమిచ్చింది. ఉత్తరాదిన ఎంతోమంది యంగ్ హీరోలు ఉండగా, దక్షిణాదిన హీరోగా ఎదుగుతోన్న విజయ్ దేవరకొండ పేరును జాన్వీ కపూర్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోతోందో చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇక భవిష్యత్తులో విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తానని కూడా జాన్వీ చెప్పడం విశేషం.

- Advertisement -