బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహర్ తనతో మాట్లాడటం మానేసిన సమయంలో తాను బరువు పెరిగానని సరదాగా వెల్లడించారు. ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ తొమ్మిదో సీజన్ ప్రోమోలో జాన్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో జాన్వీతో పాటు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా పాల్గొన్నారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. గతంలో కరణ్ జోహర్ తనతో పాటు జాన్వీ కపూర్‌తో కూడా మాట్లాడటం మానేశారని వెల్లడించారు. దీనిపై స్పందించిన కరణ్ జోహర్.. వారిద్దరి ప్రవర్తన తనను బాధించిందని చెప్పారు. దీంతో జాన్వీ సరదాగా స్పందిస్తూ మనం మాట్లాడుకోవడం ఆపేసినప్పుడు నేను బరువు పెరిగాను అని వ్యాఖ్యానించారు. ఈ సంభాషణతో కార్యక్రమంలో నవ్వులు పూశాయి.
Also Read:రీమేక్‌కు నో.. సొంత కథతో వచ్చా!
కరణ్ జోహర్ వ్యాఖ్యలపై వరుణ్ ధావన్ కూడా సరదాగా స్పందించారు. ఆ పరిస్థితి చాలా నాటకీయంగా అనిపించిందని అన్నారు. కభీ ఖుషీ కభీ ఘమ్ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలా తనకు అనిపించిందని చమత్కరించారు. ఈ ఎపిసోడ్లో అర్జున్ కపూర్ కూడా ప్రత్యేకంగా కనిపించనున్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.

