- Advertisement -
కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూతో కరోనాపై భారతావని యుద్ధం ప్రకటించింది. ఇక తెలంగాణ 24గంటల జనతా కర్ఫ్యూ విధించాలని కోరారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కర్ఫ్యూ లో స్వఛ్చందంగా పాల్గొంటున్నారు ప్రజలు. ఈ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూ రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
అత్యవసర సేవలే మినహా అన్ని సేవలు బంద్ చేశారు. అత్యవసర సేవలు అందించే సిబ్బందితో పాటు వైద్యులకు సంఘీభావంగా ప్రజలంతా సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాల్సిందిగా పీఎం, సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 63 వేల మంది పోలీసులు, 11 వేల మంది హోంగార్డులు జనతా కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్ని డిపోలకే పరిమితమయ్యాయి. దేశ వ్యాప్తంగా రైళ్వే సర్వీసులు రద్దు అయ్యాయి.
- Advertisement -