తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను, ఆ పార్టీని వణికించే వార్త ఇది. తనను, తన జనసేనపార్టీని చులకనగా చూసిన బండి సంజయ్, అర్వింద్, డికే అరుణ వంటి తెలంగాణ బీజేపీ నేతలపై ప్రతీకారం తర్చుకునేందుకు పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నారని సమాచారం. తెలంగాణలో పార్టీని విస్తరించే లక్ష్యంలో భాగంగా జనసేన పార్టీ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తనను, తన పార్టీని పదేపదే అవమానిస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి తీరుపై జనసేనాని రగిలిపోతున్నారు. అందుకే రాబోయే వరంగల్ మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసి బీజేపీ అభ్యర్థులను ఓడించాలని పవన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. నిజానికి తెలంగాణలో ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేయాలని జనసేన శ్రేణులు అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వత్తిడి చేశారు. అయితే బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి తెలంగాణ బీజేపీ నేతలు మద్దతు అడుగుతారేమోనని పవన్ వెయిట్ చేశాడు. కాని అధ్యక్షుడు బండిసంజయ్, ఎంపీ అర్వింద్, డికే అరుణ వంటి బీజేపీ నేతలు జనసేన పార్టీతో మాకు పొత్తేంటీ…అసలు తెలంగాణలో ఆ పార్టీ ఉందా అంటూ ఎద్దేవా చేశారు.
దీంతో జనసైనికులు మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే జనసేన పోటీలో ఉంటే గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పార్టీకి నష్టం చేకూరుతుందని ఆందోళన చెందిన బీజేపీ అధిష్టానం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లను పవన్ కల్యాణ్ దగ్గరకు పంపించి రాయబారం నడిపించారు. బీజేపీ పెద్దల వినతి మేరకు గ్రేటర్ ఎన్నికలలో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు పలికింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్షలాది మంది పవన్ ఫ్యాన్స్, జనసైనికులు బీజేపీ అభ‌్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. గ్రేటర్‌లో బీజేపీ గెలుపులో జనసేన పాత్ర కాదనలేనిది. అయితే గెలిచినతర్వాత బండి సంజయ్ కర్టెసీగా కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ‌్‌కు చిన్న థ్యాంక్స్ చెప్పకపోవడం జనసేన కార్యకర్తలను హర్ట్ చేసింది. అందుకే పవన్ కల్యాణ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిని పీవీ కుమార్తె, వాణీదేవికి మద్దతు పలికి బండికి తొలి షాక్ ఇచ్చారు. వాణీదేవికి పవన్ మద్దతు పలకడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జనసేనపార్టీ మద్దతుదారులైన పట్టభద్రులు టీఆర్ఎస్‌కు ఓటేసినట్లు సమాచారం. అలాగే తెలంగాణలో త్వరలో జరగనున్న వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేసి తెలంగాణ బీజేపీ నేతలకు తగిన గుణపాఠం చెప్పాలని జనసేనాని డిసైడ్ అయ్యారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం కావాలంటే ఇప్పటి నుంచే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని పవన్‌పై తెలంగాణకు చెందిన కొంతమంది నేతలు ఒత్తిడి తేవడంతో వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బరిలో దిగేందుకు నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే దాదాపు నెలక్రితమే ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధమై, వరంగల్ నగరంలో పార్టీ కార్యాలయం కూడా తెరుచుకోవడం విశేషం. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధ్యమైనన్నీ ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. స్వతహాగా పవన్‌కళ్యాణ్‌కు వరంగల్‌లో సినీ అభిమానులు ఎక్కువే. మెగా ఫ్యామిలీకి అభిమానం ప్రకటించేవాళ్లు వేల సంఖ్యలోనే ఉన్నారు. 66 డివిజన్లతో అవతరించిన నూతన గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ సమరాంగంలో జనసేన శంఖారావం పూరించడం ఖాయమని తెలుస్తోంది. పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే చర్చలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏడెనిమిది స్థానాల నుంచే పోటీ చేయాలని, అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉండాలనే ప్రాథమిక నియమాలతో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏడెనిమిది స్థానాలలో పోటీ చేస్తే లాభం లేదని..కనీసం 20 నుంచి 30 స్థానాల్లో పోటీ చేస్తే తాము గెలిచే అవకాశం లేనప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేయడం ద్వారా బీజేపీ అభ్యర్థులను ఓడించవచ్చని..తద్వారా తమను పదేపదే కించపరుస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు, ఆ పార్టీ నేతలపై ప్రతీకారం తీర్చుకోవచ్చని జనసేన నేతలు అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మొత్తంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న వార్తలు బండి సంజయ్‌తో సహా బీజేపీ నేతలకు షాకింగ్‌గా మారాయి. ఇప్పటికే పట్టభద్రుల ఎన్నికలలో ఓటమి, సాగర్ ఉప ఎన్నికలలో గెలిచే సీన్ లేకపోవడంతో బండి వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నాడు. కాని జనసేన పోటీ చేయడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ కలవరపెడుతున్నాడు. మరి బండి సంజయ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్నజనసైనికుల ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.