ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జనసేన ఫైర్

295
mp aravind
- Advertisement -

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జనసేన తెలంగాణ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతిస్తుందని పదన్ ప్రకటించగా నసేనతో జీహెచ్‌ఎంసీ, భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండదని ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది.

ఢిల్లీ అగ్రనేతలు, తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కోరడం వల్లే పవన్ పోటీని విరమించుకుని బీజేపీకి మద్దతిచ్చారని అది తెలియని అరవింద్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.

జనసేన పార్టీ ఏ పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందో మీకు తెలియకపోతే మీ అగ్రనాయకులను అడిగి తెలుసుకోండి. అంతే తప్ప జనసైనికులను రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడటం సరికాదు. ఎంపీ అరవింద్‌కు బీజేపీలో ఏం జరుగుతుందో తెలియదనుకుంట. అందుకే ఇలా పిచ్చి, పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది.

- Advertisement -