విశాఖలో జనసేన నిరసన.. రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక..

76
- Advertisement -

గ్రేటర్ మహా విశాఖ 88 వ వార్డు నరవ హెల్త్ సెంటర్ వద్ద కనీస మౌలిక సదుపాయాలు లేవు అంటూ ఈరోజు ఉదయం జనసేన నాయకుడు ఒబ్బిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నరవ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 30 వేల మందికి అందుబాటులో ఉండే హెల్త్ సెంటర్ నాలుగు నెలలుగా కనీస మౌలిక సదుపాయాలు, ల్యాబ్, బీపీ మిషన్ లేకుండా నడుపుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

పేరుకే హెల్త్ సెంటర్ కానీ సదుపాయాలు లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బీపీ చెక్ చేసుకోవడానికి కూడా గాజువాక లేదా గోపాలపట్నం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. పలుమార్లు ఈ హెల్త్ సెంటర్ గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన, పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ గాని, స్థానిక వార్డ్ కార్పొరేటర్ మొల్లు ముత్యాల నాయుడు గానీ పట్టించుకోలేదని గుర్తు చేశారు. పది రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే ఈ నిరసనల ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

- Advertisement -