పసిడి ధర తగ్గుముఖం..

78
- Advertisement -

బంగారం ధర భారీగా తగ్గుతోంది. వరుసగా మూడో రోజులు పసిడి ధర పడిపోయింది. వరుసగా మూడో రోజు తగ్గడం శుభపరిణామం. గడిచిన 10 రోజుల్లో బంగారం ధర ఐదు సార్లు తగ్గింది.. ఒకసారి స్థిరంగా ఉంది. బంగారం ఇంకా తగ్గే వరకు వేచి చూడాలి. ఇక మళ్లీ పెరుగుతుందని సంకేతాలు వస్తే.. అప్పుడు బంగారం కొనోగులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,000కి దిగొచ్చింది. నిన్నటితో పోల్చితే రూ.150 తగ్గింది. హైదరాబాద్‌లో ఒక్క గ్రాము బంగారం రూ.4,500కి లభిస్తోంది. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఇవాళ రూ.49,100గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.150 తగ్గింది. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రేటు హైదరాబాద్‌లో రూ.4,910 పలుకుతోంది.

ఏపీ, తెలంగాణలో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.45,000గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,330గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.49,450కి లభిస్తోంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 45,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర 49,000 పలుకుతోంది. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.45,000కి లభిస్తోంది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.49,100కి దిగొచ్చింది. కోల్‌కతా, బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.45,000కి అందుబాటులో ఉంది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.49,100గా ఉంది.

- Advertisement -