ఓడిపోతానని నాకు ముందే తెలుసుః పవన్ కళ్యాణ్‌

378
Pawan klayan At TANA
- Advertisement -

అమెరికాలో జరగుతున్న తానా మహాసభల్లో పాల్గోన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌. ఈసందర్భంగా ఆయన తన ఓటమిపై స్పందించారు. ఇటివలే జరిగిన ఎన్నికల్లో తమకు సీట్లు రావని, తాను ఓడిపోతామని ముందే తెలుసని చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి ఓడిపోతు వస్తున్నానని..తనకు ఓటమి కొత్త కాదని చెప్పారు. ప్రతి ఓటమి నుంచి తాను ఓ పాఠం నేర్చుకుంటున్నానని తెలిపారు.

జనసేన పార్టీని క్షేత్రస్ధాయిలో బలోపేతం చేయనున్నానని అన్నారు. నా బహిరంగ సభలకు వచ్చిన జనం అంతా ఓట్లు వేస్తారని కొంత మంది నాతో చెప్పారని..కానీ అందరూ మనకు ఓట్లు వేయరని నాకు తెలుసన్నారు. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయని ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు.

15 నిముషాల్లో తాను ఓటమి నుంచి తేరుకున్నానని తెలిపారు. జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తులే రాజకీయాల్లో తిరుగుతున్నారని, అటువంటిది తాను రాజకీయాల్లో కొనసాగితే తప్పేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతామని చెప్పారు.

- Advertisement -