తిరిగి సినిమాల్లోకి పవన్?..క్యూ కట్టిన దర్శకులు, నిర్మాతలు

311
Pawan Kalyan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ స్ధాపించి ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ఎన్నికల్లో పవన్ కింగ్ మేకర్ గా నిలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్ధానాల్లో ఓటమి పాలయ్యారు. ఇక జనసేన పార్టీ నుంచి కేవలం ఒక అభ్యర్ధి మాత్రమే విజయం సాధించారు. ఇక మరో ఐదేళ్ల వరకూ ఎన్నికలు లేకపోవడంతో పవన్ తిరిగి సినిమాల్లోకి రానున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్‌ మాత్రం తాను రాజకీయాలను వదిలి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.

రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ చర్యలు తీసుకుంటాడని జనసేన వర్గాల సమాచారం. అయితే పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయితే ఆర్ధికంగా ఆయనకు చాలా ఇబ్బందులు ఎదురుకానున్నాయి. పార్టీని నడిపించాలంటే ఆర్ధికంగా కూడా ఎంతో కొంత బలంగా ఉండాలి. ఈరోజుల్లో ఏ పార్టీ మిటింగ్ లు పెట్టాలన్న లక్షల్లో ఖర్చవుతుంది. అందుకే ఆర్ధికంగా మెరుగపడాలంటే పవన్ సినిమలు చేయాల్సిందేనని అంటున్నారు విశ్లేషకులు.

ఒకవేళ పవన్ కనుక తిరిగి సినిమాల్లోకి వస్తే మొదటి సినిమా మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారితో చేయనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అజ్నాతవాసి సినిమా సమయంలో పవన్ వారి వద్ద నుంచి అడ్వాన్స్ ను కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇక త్రివిక్రమ్ పవన్ కు మంచి స్నేహితుడు కావడంతో ఆయన కూడా కొన్ని కథలను సిద్దం చేసి ఉంచినట్లు తెలుస్తుంది. ఇక పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్‌ శంకర్ కూడా ఆయనతో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడట. ఇక ఇటివలే నిర్మాతగా మారిన రామ్ చరణ్ కూడా బాబాయ్ పవన్ తిరిగి సినిమాల్లోకి వస్తే తాను నిర్మాతగా ఉంటానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. పవన్ ఎప్పుడెప్పుడూ సినిమాల్లోకి వస్తాడా అని ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు, నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -