జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని వస్తున్న వార్తలపై స్పందించారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి నష్టం కలగకుండా ట్వీట్లు చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ఒక్కసీటు కూడా గెలవలేని బీజేపీని వెనకేసుకు వస్తే తమకు వచ్చే లాభమేంటని ప్రశ్నించారు జనసేనాని. ఏపీ ప్రజలు సంపూర్ణంగా బీజేపీని వదిలేశారన్నారు.
అలాంటి పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అని ట్వీట్ చేశారు. నా దృష్టిలో రాష్ట్రానికి బీజేపీ ఏ మేరకు అన్యాయం చేసిందో టిడిపి కూడా అంతే అన్యాయం చేసిందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం హోదా ఎన్ని మాటలు మార్చిందో ఏపీ ప్రజలకు తెలుసన్నారు. టీడీపీ ఎంపీలు మోదీ కాళ్లకు పాదాభివందనం చేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నించారు.
పార్లమెంట్ లో రాజ్ నాత్ సింగ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ను తాము ఇంకా మిత్రుడిగానే చూస్తున్నామని చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే టిడిపి, బీజేపీ ఆడుతున్న నాటకాలు ప్రజలకు అర్ధమవుతున్నాయన్నారు. ఇప్పుడుకూడా మీరు చేస్తున్నది థర్మ పోరాటం అంటే ఎలా నమ్మాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు జనసేనాని.