కరోనా ఎఫెక్ట్…కూరగాయలు అమ్ముతున్న బాలీవుడ్ నటుడు

146
bollywood

కరోనా ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్దను చిన్నాభిన్నం చేసేసింది. కరోనా దెబ్బకు అన్నిరంగాలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోగా మళ్లీ ఎప్పుడు సాధారణ పరిస్ధితి వస్తుందో తెలియని పరిస్ధితి. ఇక సినిమా రంగంపై కూడా కరోనా పెను ప్రభావం చూపింది. షూటింగ్‌లు లేక సినీ రంగంపై ఆధారపడిన కళాకారులకు పూటగడవని సిచ్చువేషన్.

దీంతో బతుకు దెరువు కోసం కూరగాయలు,పండ్లు అమ్ముకుంటున్నారు. తాజాగా ఓ మరాఠా నటుడు రోషన్‌ సింగ్ , బాలీవుడ్ నటుడు జావేద్ హైదర్ కూరగాయలు అమ్ముతున్నారు.

ఈ వీడియోని బిగ్‌ బాస్ ఫేమ్ డాలీ బింద్రా టిక్‌ టాక్‌ లో షేర్ చేసింది. అత‌నిని చూసి సినీ అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు. డ్రీమ్ గార్ల్‌లో ముఖ్య పాత్ర పోషించిన నటుడు సోలంకి దివాకర్‌ కూడా ఉపాధి లేక పండ్లు అమ్ముకున్న విష‌యం తెలిసిందే .