జన సైనికులకు భద్రత.. క్రియాశీలక సభ్యత్వం

27
- Advertisement -

ఉత్సాహంగా మొదలైన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా ప్రారంభమైందని పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ తెలిపారు.

జనసేన పార్టీ నాయకులు, యువకులు జన సైనికులు ఉత్సాహంగా పాల్గొని సభ్యత్వ నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో పార్టీ వాలంటీర్లను ఎంపిక చేశారు. నమోదు కోసం ప్రత్యేక యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఈ నాలుగవ దఫా రెట్టించిన ఉత్సాహంతో సభ్యత్వ నమోదు చేపట్టాలి’ అని పార్టీ నేతలు, శ్రేణులకు సాగర్ పిలుపునిచ్చారు. సభ్యత్వం పొందినవారికి రూ.5 లక్ష ప్రమాద బీమా లభిస్తుందని, ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందితే రూ.50 వేల వరకూ మెడి క్లెయిమ్ సదుపాయం వస్తుందని తెలిపారు.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  నాగబాబు  హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇప్పటి వరకూ 344 మంది క్రియాశీలక కార్యకర్తలు ప్రమాదాల్లో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందించారని తెలిపారు. 18 జూలై నుండి 28 జూలై వరకు సభ్యత్వ నమోదును కోనసాగుతుందని సాగర్ తెలిపారు. సభ్యత్వ నమోదు కేంద్ర కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యణ్ గారికి భద్రత కోసం సెక్యూరిటీ మరింత పేంచాల్సిన అవసరం ఏంతైన ఉందని శ్రీ సాగర్ తెలిపారు. దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని… నిస్వార్థ ప్రజ సేవ చేసే నిబద్ధత, నిజాయితీ ఉన్న నాయకుని కాపాడుకునే అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Also Read:Harishrao: దివ్యాంగులపై స్మిత సబర్వాల్ వ్యాఖ్యలు సరికావు

- Advertisement -