జనసేనకు బీజేపీతో ప్రమాదమే !

12
- Advertisement -

ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీల మద్య ఉన్న పొత్తు తాత్కాలికమే అని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు మిత్రా పక్షంగా ఉన్నప్పటికి.. ఇంతవరకు కలిసి ఏ కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఎవరికివారే అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. కానీ జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని, వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి పోటీలో నిలుస్తామని కమలనాథులు తరచూ చెబుతున్నారు. కానీ జనసేన మాత్రం తాము బీజేపీతో ఉన్నామని చెబుతున్నప్పటికి.. కలిసి పోటీ చేయడంపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ బీజేపీని నమ్మడం లేదా అనే ప్రశ్నలు కూడా తోలుస్తున్నాయి.

ఎందుకంటే బీజేపీ యొక్క స్వార్థ రాజకీయాలు ఏంటో అందరికీ తెలిసిందే. తమ పార్టీ విస్తరణకోసం కమలనాథులు ఎంతటి అడ్డదారులు తొక్కడానికైనా సిద్దంగానే ఉంటారనేది జగమెరిగిన సత్యం. అందుకు ఉదాహరణలు బోలెడన్ని ఉన్నాయి. మహారాష్ట్రలో ఉద్దవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చడం, బిహార్ లో జేడీయూ పార్టీని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించడం వంటివి.. ఎంతటి చర్చనీయాంశంగా మారయో మనందరం చూశాం. అంతే కాకుండా ప్రభుత్వాలను కుల్చేందుకు ఏక్ నాథ్ షిండే వంటి వారిని సృష్టిస్తామని బహిరంగంగానే కమలనాథులు చాలా సార్లు ప్రకటించారు. దీంతో ఏపీలో ఇప్పుడిప్పుడే బలం పెంచుకుంటున్న జనసేన విషయంలో కూడా బీజేపీ అదే ప్లాన్ లో ఉందా అనే డౌట్ రాకమానదు. ఎందుకంటే గతంతో పోలిస్తే జనసేన ఏపీలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటలని పవన్ ఉవ్విళ్లూరుతున్నారు.

ఒకవేళ జనసేన అండతో బీజేపీ బలం పెంచుకున్నప్పటికి, భవిష్యత్ లో కాషాయ పార్టీ విస్తరణ కోసం జనసేనలో ముసలం పుట్టించే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ఏపీ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే.. ప్రత్యక హోదా విషయంలో ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసింది. అలాగే విశాఖ ఉక్కు ప్రవేటీకరణ విషయంలో కూడా బీజేపీ సర్కార్ ఏపీకి అన్యాయమే చేసింది. దాంతో ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీపై గట్టిగానే వ్యత్యిరేకత చాటే అవకాశం ఉంది. అలాగే ఆ పార్టీకి మిత్రపక్షంగా కొనసాగుతున్న జనసేనపై కూడా ఆ ప్రభావం ఎంతో కొంత పడే అవకాశం ఉంది. ఇవన్నీకూడా బేరీజు వేసుకొని పవన్ బీజేపీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మరి ఎన్నికల నాటికి పవన్ బీజేపీతోనే స్నేహబంధం కొనసాగిస్తారా ? లేదా అనేది ప్రశ్నార్థకమే.

ఇవి కూడా చదవండి…

ఎంపీ కోమ‌టిరెడ్డి పై కేసు న‌మోదు

బీజేపీలో కిషన్ పెట్టిన మంట !

175 డౌటే.. జగన్ తొందరపడ్డారా ?

- Advertisement -