పక్కా ప్లాన్‌తో జనసేన..

187
- Advertisement -

2019 ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ..పక్కా ప్రణాళికలతో ప్రచారానికి సిద్దమవుతున్నాయి రాజకీయపార్టీలు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా రెడీ అవుతోంది. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కళ్యాణ్‌ సెప్టెంబర్‌ 12 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు కూడా పవన్‌ సూచించారు.

Pawan Kalyan

ఇప్పటికే 12 అంశాలతో కూడిన జనసేన విజన్‌ డాక్యుమెంట్‌ ప్రజల మన్ననలు పొందుతోంది. ఈ నేపథ్యంలోనే విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రజలకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి(ప్యాక్‌)ను పవన్‌ ఆదేశించారు. గ్రామ స్థాయి వరకు కేడర్ ను సర్వ సన్నద్ధం చేయాలని శ్రేణులకు సూచించారు. ఇక ప్రచారం కోసం ఉపయోగించుకోవాల్సిన మాధ్యమాలు,అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పవన్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.

- Advertisement -