జ‌న‌సేన‌కు గ్లాస్ గుర్తు…

461
janasena symbol
- Advertisement -

ఎట్ట‌కేల‌కు జ‌న‌సేన పార్టీకీ గుర్తును కేటాయించింది ఎల‌క్ష‌న్ క‌మిష‌న్. ఆ పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ విషయాన్ని జనసేన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా నమోదైన 29 పార్టీలకు గుర్తులను కేటాయించింది. అందులో భాగంగా ‘జనసేన’కు గ్లాసు గుర్తును కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. 2019లో జ‌రిగే సాధార‌ణ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ గ్లాస్ గుర్తుపైనే పోటీ చేయ‌నుంది. జ‌న‌సేన‌కు గ్లాస్ గుర్తు కేటాయించ‌డంతో హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు ఆ పార్టీ నేత‌లు.

- Advertisement -