కళ్యాణ్‌ దిలీప్‌కు కౌంటరిచ్చిన జనసేన..

566
janasena counter to Kalyan Dileep Sunkara ..
- Advertisement -

సోషల్‌ మీడియా,టీవీ ఛానెల్స్‌ వేదికగా ‘కల్యాణ్ దిలీప్ సుంకర’ జనసేన కార్యకర్తగా, పలు డిబేట్‌ లలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా దిలీప్ ఫేస్ బుక్‌లో జనసేన పార్టీ పెద్దలు తనను అవమానిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అంతేకాకుండా ఆ పార్టీ పెద్దలు దిలీప్‌ ని డిబెట్‌ లకు పిలవద్దని పలు టీవీచానెల్స్‌కి ఫోన్‌ చేసి చెప్పారని ఆవేధన వ్యక్తం చేశారు. అయితే మరో పోస్ట్‌ లో జనసేన పార్టీ పెద్దలకు సవాల్‌ కూడా విసిరారు. తనకూ, జనసేనకు ఎలాంటి సంబంధం లేదని పార్టీ నుంచి అదికారిక ప్రకటన ఇప్పంచండి అంటూ సవాల్‌ విసిరారు.

అయితే ఈ క్రమంలో ఓ అధికారిక ప్రకటన వచ్చింది. జనసేన పార్టీ తరఫున ఇకపై టీవీ చర్చాగోష్టులు, మీడియా సమావేశాలకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎంపిక చేసిన ప్యానల్‌లోని సభ్యులు మాత్రమే హాజరవుతారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బి. మహేందర్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే వీరంతా జనసేన పార్టీపరంగా మాట్లాడే అంశాలు, వెల్లడించే అభిప్రాయాలకు సంబంధించిన చర్చల్లో మాత్రమే పాల్గొంటారని ప్రకటనలో తెలిపారు.

ఇక ఈ ప్రకటన సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ ప్రకటన కళ్యాణ్ దిలీప్ కు ఇండైరెక్ట్‌ గా ‘జనసేన’ కౌంటరిచ్చిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ప్రకటనపై దిలీప్‌ రియాక్షన్‌ ఏంటనేది తెలియాల్సి ఉంది.

    janasena counter to Kalyan Dileep Sunkara ..

- Advertisement -