నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజున ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ నుండి నోముల భగత్,కాంగ్రెస్ నుండి జానారెడ్డి,బీజేపీ నుండి రవికుమార్,టీడీపీ నుండి మువ్వా రవికుమార్‌తో పాటు పలువురు స్వతంత్రఅభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి అట్టహాసం లేకుండా నామినేషన్ల పర్వం కొనసాగింది.
కాంగ్రెస్ నేత జానారెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా 11వ సారి నామినేషన్ దాఖలు చేశారు. తొలిసారి జనతా పార్టీ నుంచి 1978లో నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు 10 సార్లు పోటీ చేయగా ఏడుసార్లు గెలుపొందారు. 3 సార్లు ఓటమి చవిచూశారు.
తొలి ఎన్నికల్లోనే నిమ్మల రాములు చేతిలో, 1994లో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్, 2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్య చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యారు.