వైరల్…మాస్కులేకుండా సీఐ..తర్వాత ఏం జరిగిందంటే!

185
mask
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ పట్టగా మరికొన్ని రాష్ట్రాలు మాస్క్ తప్పనిసరి చేశాయి. మాస్క్ లేకుండా బయటకు వచ్చేవారికి రూ. 2 వేల ఫైన్ విధిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మాస్క్ లేకుండా బయటకు వచ్చే వారిపై కొరడా ఝూళిపిస్తున్నారు అధికారులు.

ఇక ఈ నేపథ్యంలో ఏపీలోని గుంటూరులో మాస్క్‌ లేకుండా బయటకు వచ్చిన ఓ సీఐకి జరిమానా విధించారు ఎస్పీ అమ్మిరెడ్డి. గుంటూరు అర్బన్‌ పరిధిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాగా ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జికూడలి, ఎంటీబీ కూడలిలో స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడం గుర్తించిన ఎస్పీ.. అందరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలి మీరు ఎందుకు మాస్క్ ధరించలే అని ప్రశ్నించగా సీఐ హడావిడిలో మర్చిపోయాను సార్ అనిచెప్పారు. దీంతో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లి మల్లికార్జునరావుకు జరిమానా విధించి, స్వయంగా మాస్కు తొడిగారు ఎస్పీ.

వాహనదారులను ఆపి, మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -