విఆర్ పి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి పి.పద్మావతి సమర్పణలో సుమన్, అజయ్ ఘోష్, కిషోర్, వెంకట రమణ, ప్రగ్య నైనా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం `జనం`. వెంకట రమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజు ఫిలించాంబర్ లో రిలీజ్ చేశారు.
నటుడు సుమన్ మాట్లాడుతూ…“ఈ సినిమా ఒంగోలులో షూటింగ్ చేశాం. `నేటి భారతం` కూడా అక్కడే షూటింగ్ జరిగింది. ఆ సినిమా జ్ఞాపకాలు కళ్ల ముందు కదిలాయి. అదే కోవలో వస్తోన్న చిత్రం జనం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కరప్షన్ తో పాటు అన్యాయాలు, అక్రమాల గురించి దర్శకుడు చాలా చక్కగా చూపించారు. సందేశంతో పాటు మంచి ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంటుంది. ఈ తరం పిక్చర్స్ వారి చిత్రాలు ఎలా ఉంటాయో అలా ఈ చిత్రం కూడా ఉంటుంది. ఎలక్షన్స్ సమయంలో ఈ చిత్రం రావడం గొప్ప విషయం. ప్రజల్లో మార్పు రావాలని చెప్పే చిత్రం” జనం” అన్నారు.
Also Read:పిక్ టాక్ : కసిగా చూస్తూ ఊరిస్తున్న శ్రీముఖి
నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ…“సమకాలీన రాజకీలయ అంశాలపై ఈ చిత్రం రూపొందింది. కమర్షియల్ అంశాలు కూడా మెండుగా ఉంటాయి. దర్శకుడు వెంకట రమణ గారు సినిమా రంగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. అన్నీ తానై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనానికి సంబంధించిన చిత్రం కాబట్టి బాధ్యతగా ఈ చిత్రంలో నటించా. సుమన్ గారితో ఈ చిత్రంలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఒంగోలులో షూటింగ్ చేసిన ప్రతి చిత్రం విజయం సాధించింది. ఆ కోవలో ఈ చిత్రం కూడా ఘన విజయం ఖాయం“ అన్నారు.
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ…“ఈ చిత్రం ట్రైలర్ చూశాక, పాటలు విన్నాక నేటిభారతం, దేశంలో దొంగలు పడ్డారు చిత్రాలు గుర్తొచ్చాయి. అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించిన వెంకట రమణ గారికి నా శుభాకాంక్షలు“ అన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ…”జనం” చాలా క్యాచీ టైటిల్. ట్రైలర్, పాటలు ఆకట్టుకుంటూనే ఆలోచించే విధంగా ఉన్నాయి. ఎలక్షన్స్ సమయంలో వస్తోన్న ఈ పొలిటికల్ సెటైరికల్ చిత్రం ఘన విజయం సాధించాలన్నారు.
Also Read:ఆ నటి మళ్లీ పెళ్లి.. నిజమేనా ?