ఆర్ఆర్ఆర్‌ని వెనక్కి నెట్టిన జనగణమన!

47
jana gana mana
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డులను తిరగరాసింది. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేసింది జనగణమన.

యంగ్ సూపర్ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ , సురాజ్ వెంజారమూడ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘జనగణమన’. డిజో జోస్ ఆంటోనీ తెరకెక్కించగా శ్రీదివ్య (Sridivya) కథానాయికగా నటించింది. ఏప్రిల్ 28న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ నెల 2న ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ రావడమే కాదు నెం. 1గా ట్రెండ్ అవుతోంది. ఇంతవరకూ నెం. 1 స్థానంలో ఉన్న ‘ఆర్.ఆర్.ఆర్ ని వెనక్కినెట్టింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశా ఎన్ కౌంటర్ సంఘటన ఆధారంగా వేరే నేపథ్యం, కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళంలో రూ. 10కోట్లు బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా.. రూ. 50కోట్ల వసూళ్ళను రాబట్టడం విశేషం.

- Advertisement -