కోడి పుంజు… మ‌ందు లేనిదే ముద్ద ముట్ట‌దు!

119
cock
- Advertisement -

వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మ‌హారాష్ట్ర భందారా జిల్లాలోని ఓ కోడిపుంజు మందులేనిదే ముద్ద ముట్టదు. క‌నీసం మంచినీళ్లు కూడా తాగ‌దు. భందారా న‌గ‌రానికి స‌మీపంలోని పున‌రావాస గ్రామం పిప్రీకి చెందిన భావుకాతోరే అనే వ్య‌క్తికి కోళ్ల పెంప‌కంపై ఆస‌క్తి ఎక్కువ‌. ప‌లు ర‌కాల కోళ్ల‌ను పెంచుతుంటాడు.

అయితే ఓ కోడిపుంజు మాత్రం ఇంట్లో మ‌నిషిలాగానే ఉంటుంది. ఇంట్లోని మ‌నుషుల వ‌లే ఇష్ట‌మైన ఆహారాన్ని అందిస్తాడు. అయితే ఓ రోజు ఆ కోడి పుంజు అనారోగ్యానికి గురికాగా మ‌ద్యంను ప‌ట్టించాడు. తర్వాత కొద్దిరోజులకే అది తిరగడం మొదలు పెట్టింది.

అప్పటివరకు అంతా బాగానే ఉన్నా తర్వాత నుండి అది మందుకు అలవాటై మందు లేనిదే ముద్ద ముట్టదు. దీంతో చేసేదేమీ లేక కోడిపుంజుకోసమ‌ని ప్ర‌త్యేకంగా మందు తెప్పించి ప్ర‌తిరోజూ కొంచెం పోసి దానికి ఆహారం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -