సెప్టెంబర్ 25 న ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్

254
pm modi arogya bharath
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య అభియాన్‌ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా ప్రకటించారు. 72వ స్వాత్రంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా మువ్వెన్నలా జెండాను ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ ఈ పథకాన్ని ప్రకటించారు.

pm modi arogya bharath

సెప్టెంబర్‌ 25న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి నుంచి పథకాన్ని ప్రారంభిస్తామన్నారు మోడీ. పేదలు, మధ్య తరగతి ప్రజలందరికీ ఉచితంగా వైద్య సాయం అందజేస్తామన్నారు. ఈ పథకం ద్వారా పేదలందరికీ ఉచితంగా వైద్యసాయం అందుతుందన్నారు. తొలి విడతలో 10 కోట్ల మందికి పథకం వర్తింపజేస్తామన్నారు. రోగమొస్తే ఏం చేయాలన్న భయం పేదల్లో ఉండకూడదన్నారు. ఈ పథకం అమలు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామన్నారు మోదీ. అవసరమైన వైద్య సిబ్బంది, సదుపాయాలు కల్పిస్తామని మోదీ పేర్కొన్నారు.ఆరోగ్య భారత్‌ లక్ష్యంగా ఈ పథకం పని చేస్తుందన్నారు ప్రధాని మోడీ.

- Advertisement -