ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో చోటుచేసుకున్న శక్తివంతమైన పేలుడుతో 12 మంది మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన తరువాత ఢిల్లీ పోలీస్ హై అలర్ట్ ప్రకటించి, రాజధాని వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి. అరెస్టైన నిందితులను విచారించిన తర్వాత, పేలుడు ముందు జరిపిన ప్రణాళిక మరియు రెక్కీ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
డాక్టర్ ముజమ్మిల్ గనై, ఫరీదాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక ఉగ్ర మాడ్యూల్‌లో భాగమని విచారణలో తేలింది. ఆయనతో పాటు డాక్టర్ ఉమర్ నబీ (ఉమర్ మహ్మద్) జనవరి మొదటి వారంలో ఎర్రకోట పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు అంగీకరించారు. మొదట జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) నాడే ఎర్రకోటపై దాడి చేయాలని ప్రణాళిక ఉందని తేలింది.
లేదంటే దీపావళి సందర్భంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశంలో దాడి చేయాలని కూడా యోచించింది. ఎర్రకోట సమీపంలోని పేలుడు అనుకోకుండా జరిగి ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఆ బాంబు పూర్తిగా సిద్ధంగా లేనందున దాని ప్రభావం పరిమితంగా ఉంది. పేలుడు ప్రదేశంలో ఎటువంటి గుంత (crater) ఏర్పడలేదు, అలాగే ఎటువంటి శ్రాప్నెల్స్ లేదా ప్రాజెక్టైల్‌లు లభించలేదు అని అధికారులు తెలిపారు.
Also Read:ఆస్పత్రిలో చేరిన నటుడు గోవిందా

