జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోడీ..!

406
modi
- Advertisement -

బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాదు జమ్మూ కశ్మీర్‌ నుంచి లడఖ్‌ని వేరు చేస్తూ రెండింటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది కేంద్రం. అంతేగాదు వివాదాస్పదమైన ఆర్టికల్ 35ఏను రద్దు చేసింది మోడీ సర్కార్‌.

జమ్మూ కశ్మీర్‌పై బీజేపీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై ఈ నెల 7న అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది కేంద్రం. ఇక అదే రోజు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. దీంతో మోడీ ఏం చెప్పబోతున్నారో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

జమ్ము కశ్మీర్‌ను తాము మిగిలిన దేశంతో అనుసంధానించామని రాజ్యసభలో ప్రకటించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా . భారత రాజ్యాంగం మొత్తం జమ్ము కశ్మీర్‌లో అమలవుతుందన్నారు. ఆర్టికల్‌ 370 వచ్చాకే కశ్మీర్‌లో అరాచకాలు మొదలయ్యాయని తెలిపారు. మూడు కుటుంబాలు కలిసి జమ్ముకశ్మీర్‌ను దోచుకొన్నాయని మండిపడ్డ షా… కశ్మీర్‌ను అడ్డం పెట్టుకొని కొన్ని పార్టీలు ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాలు చేశాయన్నారు.

- Advertisement -