Jammu:ఇద్దరు ఉగ్రవాదుల హతం..

11
- Advertisement -

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. బారాముల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. దీంతో భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. ఇక పహల్గాంలో మారణహోమం సృష్టించిన ఉగ్రమూక కోసం బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.

AlsoRead:ఆటా ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవం

ఉగ్రదాడి నేపథ్యంలో అమిత్ షాకు ఫోన్ చేశారు రాహుల్ గాంధీ. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు రాహుల్. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని, కష్ట సమయంలో మనం వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

- Advertisement -