గెల్లు గెలుపుకు గుమస్తా సంఘం సంపూర్ణ మద్దతు..

114
- Advertisement -

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో జమ్మికుంట గుమస్తా,అడ్తిదారుల సంఘాల అధ్యక్షులు వెంకన్న, మల్లయ్యలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో గెల్లు శ్రీనివాస్‌కు అత్యధిక మెజారిటీ తెచ్చేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని గుమస్తా, అడ్తిదారుల సంఘాలు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గుమస్తాలు, అడ్తిదారుల సంఘం భవనాల నిర్మాణానికి 10లక్షల చొప్పున మంజూరు చేస్తూ అనుమతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. అడ్తిదారుల సంఘం డిమాండ్ మేరకు మరో 20 లక్షలు మంజూరు చేస్తానని చప్పట్ల మధ్య మంత్రి హామీనిచ్చారు.

ఈ సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. ఈటల పొరపాటున గెలిస్తే హూజూరాబాద్ ప్రజలు ఓడిపోయినట్టేనని స్పష్టం చేశారు. ఆయన గెలిస్తే ఆయనకు, ఆయన కుటుంబానికి మాత్రమే ప్రయోజనం ఉంటుందన్నారు. టిఆర్ఎస్ విజయం ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది. మీకందరికి మరింత మేలు చేకూరుతుంది.రాజకీయాలలో హత్యలు ఉండవు,అన్ని కూడా ఆత్మహత్యలే అని చెప్పడానికి ఈటల ఉదంతం మంచి ఉదాహరణ అన్నారు మంత్రి.

- Advertisement -