తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గత నాలుగు సంవత్సరాలు గ్రామాల్లో, దేవాలయాల్లో వేలాది జమ్మి మొక్కలు నాటి 5 వ వసంతంలోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దసరా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుల ఆధ్వర్యంలో శామీర్పేట్ లోని శ్రీ శంకర గురుకుల వేద పాఠశాల మరియు కీసర లోని శ్రీ గాయత్రి వేద పాఠశాల పిల్లలతో ప్రారంభం అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు మరియు వేద పాఠశాల పిల్లల చేతుల మీదుగా ఆవిష్కరించారు…
వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్లును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించింది. అయితే అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని సంతోష్ కుమార్ తీసుకున్నారు.

ఈ ఏడాది 10 వేలకు పైగా జమ్మి మొక్కలు సిద్ధం చేశారు.తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీ. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం మొదలవుతుందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టీమ్ ప్రకటించారు. ఇప్పటికే పది వేలకు పైగా జమ్మి మొక్కలను సిద్దం చేస్తున్నామని, అన్ని గ్రామాలు, గుడులకు వీటిని పంపిణీ చేస్తామన్నారు.
వేద పండితులు మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాగానే రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వేదకాలం నుంచీ నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ఊరిలో గుడిలో బడిలో భాగస్వామ్యం చేయాలన్న గొప్ప ఆలోచన చేసిన ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. తమవంతుగా ప్రతీ ప్రాంతంలో జమ్మి మొక్క నాటేలా, రక్షించి పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా శ్రీ శంకర్ వేద పాఠశాల గురువు నారాయణ శర్మ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆద్వర్యంలో ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో సంతోష్ కూమార్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాణాగా జమ్మి చెట్టు నాటడం, గొప్ప విషయం అని అన్నారు. ఒక్కోక్క గ్రహనికి విశేషంగా ఒక్కో సమిద చెట్టుని బుషులు మనకు అందజేసారని శమీ చెట్టు నవగ్రహలలో శని దేవుడికి చాలా విషేషమైన చెట్టు అని అన్నారు. ఏడున్నర సంవత్సరాల శనిదోషం పోవాలంటే జెమ్మి చెట్టు నాటడం శనిదేవుని గుడిలో నువ్వులు నూనెలో ధీపం పెట్టడం ద్వారా పోతుందని అన్నారు .ఇది అరుదైన చెట్టు. ఈ చెట్టు సిటీలో ఎక్కడ కనబడదు _ ఆడవిలో మత్రమే కనబడుతుంది. జమ్మి చెట్టు నాటడం ద్వారా దోష నివారణ జరుగుతుంది. సంతోష్ కుమార్ వేలాదిగా మొక్కలు నాడడం గొప్ప మిషయము తెలంగాణ ప్రజలందరికి క్షేమ లాభాలు జరగాలని కోరుకున్నారు…

మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు వేద పాఠశాలల్లో జమ్మి చెట్టు నాటడం సంతోషంగా ఉంది.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ సంతోష్ కుమార్ కి కీసర మాజీ సర్పంచ్ మాధురీ వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు..ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు…
Also Read:కాళేశ్వరం..అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్

