జమిలి ఎన్నికలు.. బీజేపీకి లాభామా?

37
- Advertisement -

2024 పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ గట్టిగా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికీ రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ మూడో సారి కూడా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. అంతేకాకుండా ఈసారి 300 కు పైగా సీట్లు సాధించాలనే టార్గెట్ కూడా పెట్టుకుంది. దాంతో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎత్తుగడలు, వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని విపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అందుకోసం ఐక్యతే మంత్రంగా జపిస్తున్నాయి. .

ఎప్పటికే అన్నీ పార్టీలు ఏకమయ్యేందుకు కత్తిగానే కసరత్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అనుకున్న లక్ష్యం చేరాలంటే అంతా ఈజీ అయిన పని కాదని విశ్లేషకులు చెబుతున్నా మాట. అయితే వచ్చే ఎన్నికల్లో అనుకున్న లక్ష్యం చేరాలంటే బీజేపీ ముందున్న మాస్టర్ ప్లాన్ జమిలి ఎన్నికల విధానాన్ని ప్రవేశ పెట్టడం. అంటే అన్నీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం. ఇలా చేయడం వల్ల బిజెపి అన్నీ రాష్ట్రాలపై ఏక కాలంలో దృష్టి పెట్టేందుకు వీలు ఉంటుంది. పైగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గట్టిగా ప్రచారం చేసుకోవచ్చు.

Also Read:ఆ నటీమణులు షాకింగ్ కామెంట్స్

అందువల్ల జమిలి ఎన్నికల విధానాన్ని ప్రవేశ పెడితే బీజేపీకి గట్టిగానే లాభం చేకూరే అవకాశం ఉంటుంది. అందుకే మోడి సర్కార్ ఆ విధానం వైపు అడుగులు వేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే జమిలి ఎన్నికల విధానంపై రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అవుతుంది. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో జమిలి ఎన్నికల విధానం ప్రవేశ పెడితే ఈ రాష్ట్రాల ఎలక్షన్స్ టైమింగ్ లో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వర్తించాల్సి వస్తే కర్నాటక విషయంలో కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. మరి కేంద్ర బీజేపీ సర్కార్ ఎన్నికల విషయంలో ఎలా అడుగులు వేస్తుందో చూడాలి.

Also Read:‘మిషన్ సౌత్’ రంగంలోకి మోడి..?

- Advertisement -