చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం, గోకులాపురం, అనుపల్లిలో జల్లికట్టు వేడుకలు వైభవంగా ప్రారంభయ్యాయి. ఉదయం పశువులను పూజించి వాటి కొమ్ములకు రంగులు అద్దారు.రాజకీయ,సీని ప్రముఖుల చిత్రపటాలు వాటి కొమ్ములకు కట్టి రంగంలోకి దించారు. రోడ్డుకు ఇరువైపులా యువకులు బారులు తీరారు. డప్పుల మోతకు ఎద్దులు పరుగెత్తుతుంటే వాటిని నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. కొందరు పలకలు దక్కించుకుని కేరింతలు కొట్టారు.
ఈ పోటీలను చూసేందుకు పాల్లొనేందుకు ఆంధ్రా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జల్లికట్టు అభిమానులు భారీగా తరలిరావడంతో గ్రామం కిక్కిరిసిపోయింది. మేడలు,చెట్లపై నుంచి పోటీలను ఆశక్తి తిలకించారు. వచ్చిన ప్రజలకు గ్రామస్థులు భోజన వసతులు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్థులు అసహనానికి గురయ్యారు. ఎక్కడా,ఎప్పుడు లేని విధంగా సంప్రదాయ క్రీడల పట్ల పోలీసులు అడ్డుకోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నించారు.